మునుగోడు లో ఇప్పటి వరకు1 కోటి 48 లక్షలు సీజ్ చేసినట్టు ఈసీ వెల్లడి

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నగదు పంపిణీ జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ పేర్కొన్నారు.ఉపఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న రోహిత్ సింగ్.

 Ec Revealed That 1 Crore 48 Lakhs Have Been Seized So Far In Munugodu-TeluguStop.com

సోమవారం విలేకరులతో మాట్లాడారు.డబ్బులు తరలించకుండా ఎక్కడికక్కడ పోలీసులతో తనిఖీలు జరిపిస్తున్నామని వివరించారు.

ఇప్పటి వరకు తనిఖీలలో సుమారు కోటిన్నరకు పైగా నగదు పట్టుబడిందని తెలిపారు.రూ.1,48,44,160 ల నగదును సీజ్ చేసినట్లు వివరించారు.ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు రూ.లక్ష విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రోహిత్ సింగ్ తెలిపారు.మునుగోడులో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారని ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ చెప్పారు.

ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారు రోజూ తమ ఆఫీసుకు వస్తున్నారని ఆయన వివరించారు.వాళ్ల నుంచి వివరాలు సేకరించి, పరిశీలిస్తున్నామని వివరించారు.ఉప ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనలు అన్నింటినీ పాటిస్తున్నామని చెప్పారు.ఈవీఎం మెషీన్లతో ఇటీవల నిర్వహించిన మాక్ పోల్ సాఫీగా జరిగిందని పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రోహిత్ సింగ్ వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube