టి20 ప్రపంచ కప్ కు ముందు దాదాపు అందరి చూపు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మీదే ఉండేది.ఎందుకంటే విరాట్ కోహ్లీ బాగా ఆడడం పైనే టీమిండియా విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.స్కోర్ ఎంత ఉన్నా విరాట్ కోహ్లీ క్రిజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు వణికి పోవాల్సిందే.ఎందుకంటే కింగ్ కోహ్లీ జట్టు వికెట్లన్నీ పడిపోయినప్పుడు ఒక్కడే నిలబడి జట్టుకు విజయాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటాడు.
టి20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ పై కింగ్ కోహ్లీ తన క్లాస్ చేజ్ తో మరొకసారి విశ్వరూపాన్ని చూపించాడు.దానితో టీం ఇండియా మాజీ కెప్టెన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.ఈ సందర్భంగా కింగ్ కోహ్లీ మాట్లాడుతూ ఏం మాట్లాడాలో తెలియని తెలియడం లేదని, మ్యాచ్ ఎలా గెలిచామో ఇప్పటివరకు నమ్మలేకపోతున్నానని చెప్పాడు.
చివరి వరకు అవుట్ కాకుండా ఉంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తామని హార్థిక్ గట్టిగా నమ్మాడని కోహ్లీ తెలిపాడు.
షాహిన్ అఫ్రిది పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే అతడిని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాం.
హరీస్ రవూఫ్ పాకిస్తాన్ యొక్క ప్రధాన బౌలర్ కాబట్టి అతన్ని ఉతికితే పాకిస్తాన్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని నాకు ముందే తెలుసు.అందుకే అతడి బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టాను.ఇప్పటివరకు నేను ఆడిన ఇన్నింగ్స్ లలో మొహాలీలో ఆస్ట్రేలియా పై ఆడిన ఇన్నింగ్స్ నే హైలెట్గా చెప్పేవాడిని, కానీ ఇవాల్టి నుంచి పాకిస్తాన్ తో మ్యాచ్ నా బెస్ట్ ఇన్నింగ్స్ అని ఇప్పటినుంచి చెబుతాను.ఈ మ్యాచ్ లో హార్దిక్ సహకారం మరువలేనిది.
ఇంకా చెప్పాలంటే మరీ ముఖ్యంగా ప్రేక్షకుల మద్దతు అమోఘమని వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కోహ్లీ చెప్పాడు.