సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇండస్ట్రీలో ఏం జరిగినా ఇట్టే బయలు పడిపోతుంది.సెలబ్రిటీస్ ఏం చేసినా చివరికి తుమ్మి నా, దగ్గినా అదొక వార్తలాగా అనేక పోస్టులు పుట్టుకొస్తాయి.
మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల విషయాల్లో అయితే సోషల్ మీడియాకి ఎలాంటి అడ్డంకులు లేకుండా అనేక రకా విషయాలు పై చర్చలు జరుగుతూనే ఉంటాయి.స్టార్ హీరోలు ఏం చేసినా, వారు ఎలాంటి బట్టలు వేసుకున్న, వారు వాడే బ్రాండెడ్ ఐటమ్స్ అయినా అలాగే వారి భార్యలు లేదా వ్యక్తిగత విషయాలైనా కూడా త్వరగా ట్రేండింగ్ లోకి వస్తూ ఉంటాయి.
అయితే గమ్మత్తుగా ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు ఎవరెవరు ఏ డ్రెస్సుల్లో బాగుంటారు అనేది ఇవార్త సారాంశం.
ముఖ్యంగా టాలీవుడ్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల భార్యలు ఏం చేసినా కూడా సోషల్ మీడియా వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పద్ధతికి మారుపేరు అన్నట్టుగా ఆమె ఎక్కువగా బయటకు కనిపించదు.
ఆమె ప్రపంచం అంతా కూడా కుటుంబమే.పద్ధతి గానే బట్టలు కూడా సెలెక్ట్ చేసుకుంటుంది.
ఆమె పెద్దగా బ్రాండెడ్ వస్తువులు వేసుకున్నట్టుగా కూడా కనిపించదు.ఇటీవల భర్తతో కలిసి జపాన్ టూర్ కి వెళ్ళిన మాడ్రన్ బట్టల్లో కనిపించినా కూడా ఆమెను ఒక తెలుగు ఇంటి మహాలక్ష్మి గానే అందరూ పోలుస్తున్నారు.
లక్ష్మి ప్రణతికి చీరలు మాత్రమే చక్కగా నప్పుతాయని ఇకపోతే చుడిదార్ లాంటి డ్రెస్ కూడా బాగా నప్పుతాయని సోషల్ మీడియా భావిస్తోంది.

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అయితే మాడ్రన్ మహాలక్ష్మి.ఆమె ప్రతి డ్రెస్ కూడా ఎంతో సెలెక్టివ్ గా ఉండేలా చూసుకుంటుంది.ఆమెకు పర్సనల్ గా కాస్టింగ్ డిజైనర్ కూడా ఉన్నాడు.
అందుకే మోడల్ డ్రెస్సులు హీరోయిన్స్ ని మించి ఆమె కాస్ట్యూమ్స్ ఉంటాయి.అందుకే ఆమెని చీరలో కన్నా మోడరన్ డ్రెస్సులో చూడడానికే అల్లు అర్జున్ అభిమానులు ఇష్టపడుతున్నారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన విషయానికొస్తే ఈమె కాస్త మోడరన్, కాస్త ట్రెడిషనల్ అన్నట్టుగా ఏది వేసుకున్న బాగానే నప్పుతుంది అంటుంది సోషల్ మీడియా.ఎక్కువగా సెమీ మోడల్ డ్రెస్సుల్లో కనిపించే ఉపాసన తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే బట్టలను కూడా సెలెక్ట్ చేసుకుంటుంది.పథ చీరలను కూడా కొత్తగా ప్రజెంట్ చేయడంలో ఉపాసన దిట్ట అని చెప్పాలి.

ఇక మహేష్ బాబు భార్య నమ్రత విషయానికి వస్తే ఆమె చీరలు కట్టుకున్న సందర్భం ఒకటి కూడా ప్రేక్షకులకు గుర్తుండి ఉండే ఛాన్స్ లేదు.ఎందుకంటే ఎక్కువగా చుడిదార్ లోనే కనిపిస్తుంది లేదంటే మోడరన్ బట్టల్లో కనిపిస్తుంది.ఆమె ట్రెడిషనల్ డ్రెస్సులు వేయడం చాలా తక్కువ.
అందుకే ట్రెడిషనల్ లుక్ లోనే మహేష్ బాబు భార్యని చూడాలని ఇప్పటికి ప్రేక్షకులు కోరుకుంటున్నా ఆమె మోడ్రన్ లుక్ కే ఓటేస్తారు
.






