కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలతో దీపావళి వేడుకలు చేసుకున్న సీఎం..!!

2019 నవంబర్ నెలలో చైనాలో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకి కంటిమీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నబిన్నం అయిపోయాయి.

 Cm Ashok Gehlot Celebrated Diwali With Orphans Who Lost Their Parents Due To Cor-TeluguStop.com

చాలామంది తమ బంధువులను తోబుట్టువులను కూడా కోల్పోయారు.ఇండియాలో సెకండ్ వేవ్ కారణంగా చాలామంది మరణించడం జరిగింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో దీపావళి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వినూత్నంగా తన నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

మేటర్ లోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలతో కలసి జరుపుకున్నారు.అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

అంతేకాకుండా వాళ్లకి ప్రత్యేకమైన వంటకాలు కూడా తయారు చేయడం జరిగింది.ఆటపాటలు అంత ముగించుకున్నాక అనాధ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి లంచ్ కూడా చేయటం విశేషం.

అంతేకాకుండా ఆ పిల్లలను చూసుకుంటున్న గార్డియన్స్ తో కూడా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు.పిల్లల గురుంచి అని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube