డ్రీమ్ కారు కొన్నానంటూ శివజ్యోతి పోస్ట్.. నెటిజన్స్ ట్రోల్స్?

శివ జ్యోతి పేరు కంటే తీన్మార్ సావిత్రి అనే ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలే లేరని చెప్పవచ్చు.ఎందుకంటే తన మాటలతో తెలంగాణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Netizens Trolls On Shiva Jyothi Dream Car Details, Shiva Jyothi , Teenamr Savitr-TeluguStop.com

ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తలు ద్వారా న్యూస్ యాంకర్ గా పరిచయమైంది.

అందులో తను మాట్లాడే విధానం, చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అంతేకాకుండా తనతో పాటు మరో యాంకర్ బిత్తిరి సత్తి కూడా అందరికీ తెలిసిందే.

ఇక అతనితో తమ్ముడు అనుకుంటూ మాటలతో బాగా సందడి చేసేది.పైగా అందులో సావిత్రి కట్టుబొట్టు కూడా బాగా ఉండేది.

దాంతో తీన్మార్ వార్తలు రేటింగు లో కూడా మొదటి స్థానంలో ఉండేది.అలా మనకు పరిచయమైన సావిత్రి అసలు పేరు శివ జ్యోతి.

ఈమె తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, నాగంపేట గ్రామానికి చెందినది.ఈమెకు గంగూలి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది.ఇక యాంకర్ గా మంచి గుర్తింపు పొందాలని కొన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది.ఇక ఆమె కెరీర్ మొదట్లో తన భాష వల్ల, తన గొంతు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

అదే సమయంలో v6 ఛానల్ వారు తెలంగాణ భాషలో మాట్లాడే వాళ్ళ గురించి ప్రకటించడంతో అందులో చదివి మంచి సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.

Telugu Biggboss, Netizens, Shiva Jyothi, Shivajyothi Car, Teenamr Savitri, Troll

ఇక అలా v6 లో తీన్మార్ సావిత్రిలా, బుగ్గల జాకెట్ ధరించుకున్న యాంకర్ గా పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత సావిత్రికి బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది.ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది.

సావిత్రక్క బాగా ఎమోషనల్ అని బిగ్ బాస్ షో ద్వారా తెలిసిపోయింది.ఇక బిగ్ బాస్ తర్వాత సావిత్రి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది.

ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది.వారితో కలిసి బాగా పార్టీలలో తిరుగుతూ ఉంటుంది.

పైగా సావిత్రక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి బిగ్ బాస్ తర్వాత కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది.

మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

Telugu Biggboss, Netizens, Shiva Jyothi, Shivajyothi Car, Teenamr Savitri, Troll

ముఖ్యంగా తనంటే ఎంతో అభిమానించే ప్రజలే ఆమె వస్త్రధారణ చూసి తట్టుకోలేకపోతున్నారు.తన ఇన్ స్టా లో ఎప్పటికప్పుడు ఫోటోలు బాగా పంచుకుంటుంది.తాజాగా ఇన్ స్టాగ్రామ్ గా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తాము కొత్త కారు కొన్నట్లు కనిపిస్తుంది.

దీంతో డ్రీమ్ కారు కొన్నాను అంటూ శివ జ్యోతి షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కంగ్రాట్స్ అని కామెంట్స్ చేయగా ఓ నేటిజన్ మాత్రం మీరు నిజంగా కొంటున్నారా లేదా కావాలని వీడియోలు చేస్తున్నారా అని కామెంట్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube