బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 ప్రేక్షకులను గత సీజన్లతో పోల్చి చూస్తే మెప్పించలేదనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోను తక్కువ రోజుల్లోనే ముగిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సీజన్ తో బిగ్ బాస్ షోను స్టాప్ చేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యారు.
శ్రీసత్య అర్జున్ కళ్యాణ్ జోడీ బిగ్ బాస్ హౌస్ లో మంచి పేరు తెచ్చుకుంది.
అయితే శ్రీసత్యకు ప్రాధాన్యత ఇస్తూ గేమ్ పై దృష్టి పెట్టకపోవడం అర్జున్ కళ్యాణ్ కు మైనస్ అయింది.
అర్జున్ కళ్యాణ్ కు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా అతనికి ఒకింత మైనస్ అయింది మరోవైపు నాగార్జున హోస్టింగ్ కూడా గత సీజన్లతో పోల్చి చూస్తే ఆకట్టుకునే విధంగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సీజన్ పై వచ్చిన స్థాయిలో గతంలో ఏ సీజన్ పై కూడా విమర్శలు అయితే రాలేదనే సంగతి తెలిసిందే.
అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ కు ఒక విధంగా శ్రీసత్య కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ షో సీజన్6 లాస్ట్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా నాగార్జునపై ఈ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు రావడంపై నాగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.నాగార్జున కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

నాగార్జున కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.నాగ్ 100వ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.నాగ్ తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.







