అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్నిప్రమాదం జరిగింది.సెయింట్ గోబైన్ పరిశ్రమలో గ్యాస్ పైప్ లైన్ లీకైంది.
దీంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఈ ప్రమాదంలో ఓ ఇంజినీర్ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.







