మునుగోడు ఉపఎన్నిక సమయంలో నోట్ల కట్టలు భారీగా పట్టుబడుతున్నాయి.ఇప్పటికే పలుమార్లు అక్రమంగా తరలిస్తున్న నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సోదాల్లో నగదును పోలీసులు పట్టుకున్నారు.కారులో తరలిస్తున్న రూ.64.63 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.అనంతరం కృష్ణ కల్యాణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.