టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా.అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21వ తేదీ థియేటర్లలో విడుదలయ్యే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా వెంకటేష్ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాకు కొంతమేర ప్లస్ అయింది.
ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్నటువంటి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
ఇకపోతే సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత అనంతరం డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ మీడియా హక్కుల గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీసమస్త భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఆహాలో ప్రసారం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ రాకపోయినా ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ హక్కుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇకపోతే విశ్వక్ ఇదివరకే నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా హక్కులను కూడా ఆహా కైవసం చేసుకుంది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు విశ్వక్ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ క్రమంలోనే ఓరి దేవుడా ఓటీటీ హక్కులను ఆహా కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలవడునున్నట్లు సమాచారం.







