అమరావతికి శంకుస్థాపన జరిగి ఏడేళ్లు కావడంతో చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015వ సంవత్సరంలో అమరావతి రాజధానిగా ప్రకటించడం జరిగింది.ఇక అదే ఏడాది అక్టోబర్ 22వ తారీకు ప్రధాని మోడీ శంకుస్థాపన కూడా చేశారు.ఈ క్రమంలో శంకుస్థాపన జరిగి ఏడు సంవత్సరాలు పూర్తి కావడంతో చంద్రబాబు ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.“ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది.

 Chandrababu Emotional Tweet As It Has Been Seven Years Since The Foundation Ston-TeluguStop.com

కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించాం.పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యింది.అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం.ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారు.

ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేసాడు.

అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ కుతంత్రాలు సాగవు.ఆంధ్రుల రాజధాని అమరావతే.అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది.నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది….

అమరావతే గెలుస్తుంది… ఇదే ఫైనల్”.అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో చాలా ఎమోషనల్ ట్వీట్ పెట్టడం జరిగింది.

 అంతేకాకుండా ఆనాడు శంకుస్థాపన జరిగిన రోజు ప్రధాని మోడీతో దిగిన ఫోటో కూడా పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube