బాలకృష్ణ కెరీర్ అప్పుడప్పుడే హీరో గా ప్రారంభం అయ్యి నిలదొక్కుకుంటున్న రోజులు అవి.అదే సమయంలో బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ లతో ఒక సినిమా చేయించాలని నిర్మాత ఎస్ వెంకటరత్నం భావించి పెద్దాయన దగ్గరికి వెళ్లారట.
కానీ కథ మొత్తం విన్న తర్వాత అంత బరువైన పాత్ర బాలకృష్ణ వల్ల కాదు నేనే చేస్తాను అంటూ దర్శక నిర్మాతలను తిప్పి పంపార ఎన్టీఆర్.వేరే ఎవరైనా కూడా అయితే ఎన్టీఆర్ చేసిన పని చేసేవారు కాదేమో.
కొడుకు కెరీర్ కన్నా కూడా సినిమా యొక్క ప్రాధాన్యత ముఖ్యం కాబట్టి ఎన్టీఆర్ బాలకృష్ణ ను సినిమా నుంచి తప్పించాడట.మరి అంత బరువైన పాత్ర ఏంటి ఎన్టీఆర్ ఎందుకు వద్దు అన్నాడు అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1977లో ఎన్టీఆర్ హీరోగా కైకాల సత్యనారాయణ యముడిగా తాతనేని రామారావు దర్శకుడిగా, ఎస్ వెంకటరత్నం నిర్మాతగా వచ్చిన సినిమా యమగోల. ఈ చిత్రం విడుదలై అప్పట్లో సంచలనం సృష్టించింది.
అయితే ఈ సినిమా మొదట బాలకృష్ణ హీరోగా, యముడు పాత్ర ఎన్టీఆర్ తో చేయించాలని భావించి కథ సిద్ధం చేసుకున్నారట సినిమా దర్శక నిర్మాతలు.కానీ ఆ సినిమాకి ఉన్న ప్రాముఖ్యత వల్ల అంత బరువైన పాత్రను బాలకృష్ణ మోయలేడేమో అని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారట.
దాంతో తానే హీరోగా చేస్తానని కైకాల సత్య నారాయణ చేత యముడి పాత్ర వేపిద్దామని చెప్పి నిర్మాతను పంపించేశాడట.
అనుకున్నట్టుగానే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఈ చిత్రం కోసం వాహిని స్టూడియో లో వేసిన యముడి సెట్టు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకులు బ్రహమరథం పట్టారు.
నిజానికి సోషల్ ఫాంటసీ ఫిలిం అయినటువంటి యమగోల సినిమా తరహా లోనే అంతకుముందే దేవాంతకుడిగా ఎన్టీఆర్ ఒక సినిమా తీయగా అది కూడా విజయం సాధించింది.ఒకే రకమైన కథతో రెండోసారి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాగా యమగోల సైతం ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
ఒక వేళా ఈ సినిమా బాలకృష్ణ చేసి ఉంటె ఇంతటి విజయం సాధించేది కాదేమో.