దర్శక ధీరుడు రాజమౌళి కెమెరా మెన్ గా మారాడు.ఆయన తీసిన ఓ రియల్ జోడీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ రాజమౌళి ఏం ఫోటో తీశాడు అంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆయన సతీమణి ఉపాసనల ఫోటో తీశాడు.ఆర్.ఆర్.ఆర్ జపాన్ రిలీజ్ సందర్భంగా ఫ్యామిలీతో వెళ్లారు ఆర్.ఆర్.ఆర్ హీరోలు.అక్కడ ప్రమోషన్స్ చేసి జపాన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వీరు.ప్రమోషన్స్ ముగించుకుని అక్కడ అందాలను ఆస్వాదిస్తున్నారు.ఈ క్రమంలో చరణ్, ఉపాసనల ఫోటోని క్లిక్ అనిపించాడు రాజమౌళి.
ఈ ఫోటో ఉపాసన షేర్ చేస్తూ ఫోటో రాజమౌళి తీశారని చెప్పింది.
ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు జపాన్ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ ఆహ్వానం అందింది.జపాన్ లో తెలుగు హీరోలకు ఈ మాత్రం క్రేజ్ ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా రాజమౌళి వల్లే అని చెప్పొచ్చు.
ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి ఈ ముగ్గురు మళ్లీ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు.ఇదే జోష్ లో వీరిద్దరితో మరో మల్టీస్టారర్ ప్లాన్ చేయొచ్చు కదా సర్ అని రాజమౌళిని అడుగుతున్నారు ఆడియన్స్.







