ఏపీలో జూనియర్ల డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.వైద్యుల ఉపకార వేతనం పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.దీనిలో భాగంగా పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.44 వేల నుంచి రూ.50,686 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.సెకండియర్ విద్యార్థులకు రూ.46 వేల నుంచి రూ.53 వేలకు పెరిగింది.థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319 పెరిగింది.మరోవైపు ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,586 నుంచి రూ.22,527 కు స్టైఫండ్ పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.







