యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో విహరిస్తున్న విషయం తెలిసిందే.ట్రిపుల్ ఆర్ జపాన్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రొమోషన్స్ కోసం తారక్ జపాన్ వెళ్లగా అక్కడి నుండి ఎన్టీఆర్ వరుస ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
తారక్ చాలా రోజుల తర్వాత బయటకు కనిపించడంతో ఈయన లుక్ లో వేరియేషన్స్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.
నిన్నటికి నిన్న ఒక ఫేమస్ ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే.
ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.ఇక తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్ లోకి మారిపోయిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఇప్పుడు క్లాసిక్ లుక్ తో ఆకట్టు కుంటున్నాడు.ఈయన ఫోటోలు చూసిన ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.జపాన్ లో ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న తారక్ కు అక్కడ ఇది రెండవ రోజు.నిన్నటి ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో.ఇక ఇప్పుడు బయటకు వచ్చిన ఫోటోలు కూడా అంతే వైరల్ అయ్యాయి.
ఇటీవల కాలంలో ఈయన కాస్త బరువు పెరిగి ఏ మాత్రం ఆకట్టుకునే లుక్ లో లేడు అని కామెంట్స్ వినిపించిన నేపథ్యంలో తారక్ కొత్త లుక్ కు అంతా ఫిదా అయ్యేలా చేసాడు.ఈ రోజు తారక్ షేర్ చేసిన ఫోటోలలో మరింత స్టైల్ గా ఉన్నాడు. గాగుల్స్ పెట్టుకుని టి షర్ట్ తో స్టైలిష్ గా ఇంకా స్లిమ్ గా కనిపిస్తున్న ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.
ట్రిపుల్ ఆర్ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న అంటే ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అక్కడ ప్రొమోషన్స్ తర్వాత తారక్ ఎన్టీఆర్30 సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.