యాదాద్రి జిల్లా:టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం టీపీసీసీ ప్రతినిధి దుబ్బాక నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు గడప గడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా దుబ్బాక నరసింహా రెడ్డి మాట్లాడుతూ హస్తం మన నేస్తమని, మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
హస్తం పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభ్యర్ధించారు.గడపగడపకు వెళ్లి తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేయాలని,అహంకార పూరితమైన ఈ నిరంకుశ పాలనను మీ ఓటు ద్వారా అంతం మొందించాలని కోరారు.