కృష్ణాజిల్లా, గుడివాడ: మాజీ మంత్రి కొడాలి నాని పై కృష్ణాజిల్లా గుడివాడ టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఏదో అభివృద్ధి జరిగిందని కొడాలి నాని మాట్లాడుతున్నాడని, గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని రావి సవాల్ చేశారు.
ప్రజలకు సమాధానం చెప్పలేని నాని, మాట మాటకు చంద్రబాబు పై మాట్లాడటం హాస్యాస్పదమని, గుడివాడలో వందలాది ఎకరాల అసైండ్ భూములు కొడాలి నాని కుటుంబ సభ్యుల పేర్లు పై ఉన్నాయని 22ఎ భూముల మార్పుతో వైసిపి నేతలకే భారీ లబ్ధి చేకూరినట్లు రావి చెప్పారు.
జగన్ ప్యాలెస్ పిల్లి కాకపోతే, పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలను ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.