రిషబ్ శెట్టి హీరోగా కన్నడంలో రూపొందిన కాంతార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.కన్నడనాట ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసి టాప్ 3 గా నిలిచిన విషయం తెలిసిందే.
చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కేజిఎఫ్ రేంజ్ సినిమా అంటూ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగు లో భారీగా పోటీ ఉన్నప్పటికీ మొదటి వారం మంచి కలెక్షన్స్ నమోదు చేసింది.
ఏకంగా పాతిక కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టిందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ఈ సినిమా లాంగ్ రన్ లో 50 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుందని అంతా భావించారు, కానీ నేడు విడుదలైన సినిమాలు కొన్ని పాజిటివ్ టాక్ దక్కించుకున్న కారణంగా ఈ కన్నడ సినిమా ను తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకునే అవకాశాలు లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ను మరిన్ని రోజులు తెలుగు ప్రేక్షకులు చూస్తారని ఇలాంటి సినిమా లకు తెలుగు ప్రేక్షకులు మొహం దాసి ఉన్నారంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాంతార వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు చూడాలి.తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చూసి ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కాంతార సినిమా మరి కొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడి భారీ వసూళ్లను నమోదు చేయాలంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.మరి ఈ సినిమా లాంగ్ రన్ లో 50 కోట్లు సాధించి కన్నడ సినీ చరిత్రలో మరో రికార్డ్ ను నమోదు చేస్తుందా అనేది చూడాలి.