టీటీడీకి ఒలెక్ట్రా సంస్థ పది ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనుంది.10 ఎలక్ట్రిక్ బస్సులు అందించినట్లు ఆ సంస్థ సీఈవో ప్రదీప్ వెల్లడించారు.ఒలెక్ట్రా సంస్థను బస్సులు అందజేయాలని కోరినట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే పది బస్సులు ఇచ్చేందుకు సీఈవో ప్రదీప్ అంగీకరించారని అన్నారు, ప్రస్తుతం తిరుమల కొండకు 12 ఉచిత బస్సులు డీజిల్ తో నడుస్తున్నాయని టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
వాటి స్థానంలో 10 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు, పర్యావరణ పరిరక్షణకు ఇప్పటికే ప్లాస్టిక్ ను నిషేధించామని టీటీడీ చైర్మన్ తెలిపారు.







