టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సందీప్ కిషన్ వరస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేశారు.హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలకు గ్యాప్ తీసుకున్నారని చెప్పాలి.
గల్లీ రౌడీ అనే సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత మైఖేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాని రామ్మోహన్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పనులను ప్రారంభం అయినప్పటికీ ఇంకా ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు.
ఇలా చాలా ఆలస్యంగా షూటింగ్ పనులను జరుపుకున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో సందీప్ కిషన్ లుక్ పూర్తిగా మారిపోయింది.

ఈ సినిమాలో ఈయన సరైన లుక్ కనిపించడం కోసం పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.ఈ సినిమా కోసం ఏకంగా హీరో సందీప్ కిషన్ 24 కిలోల బరువు తగ్గారని తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ టీజర్ కార్యక్రమంలో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ సాధారణంగా మన జీవితంలో ఎంతోమంది ఇది మంచి చెడు అని చెబుతూ ఉంటారు.అయితే మనం ఎంతవరకు చేయగలం మన కెపాసిటీ ఎంత అనే విషయంలో మనకు క్లారిటీ ఉండాలి.
ఇలా నాకున్న క్లారిటీతో నేను ప్రయత్నించిన చిత్రమే మైఖేల్.ఈ సినిమా కోసం ఏకంగా 24 కిలోల బరువు తగ్గానని ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







