దాదాపు బిజెపితో తెగ తెంపులు చేసుకుంటున్నాను అన్నట్టుగాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బిజెపి రూట్ మ్యాప్ అడిగానని , కానీ వారు ఇవ్వలేదని , బిజెపి తో పొత్తు ఉన్నా.
సమన్వయం చేసుకోలేకపోతున్నామని పవన్ ప్రకటించారు.అయితే ఆ వ్యాఖ్యలతో జనసేన, బీజేపీలు మధ్య పొత్తుల ఎత్తు ముగిసినట్టేనని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
ఏపీలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టు గా ఉంది.జనసేన సహకారంతో కాస్త కూసో బలపడి, రాబోయే ఎన్నికల్లో కొన్ని స్థానాలను బిజెపి దక్కించుకుంటుందని అంతా అంచనా వేశారు.
బిజెపి సహకారంతో పవన్ అధికారంలోకి వస్తే బిజెపి అగ్ర నాయకులు చక్రం చెప్పేందుకు అవకాశం ఏర్పడేది.అయితే ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పవన్ ఆ పార్టీతో పొత్తు పై తన అసంతృప్తిని బయటపెట్టారు.
ఇంత జరుగుతున్నా.ఏపీ బీజేపీ నేతలు ఈ వ్యవహారం పై స్పందించారు.
కానీ బిజెపి అగ్ర నేతలు ఎవరూ పవన్ తో ఈ విషయంపై చర్చించేందుకు ప్రయత్నించకపోవడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.వాస్తవంగా జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రధాన నరేంద్ర మోది దర్శనం పవన్ కు దక్కలేదు.
ఇక బిజెపి అగ్రనేతలు సైతం అంటీ ముట్టున్నట్టుగానే పవన్ తో వ్యవహరిస్తున్నారు.ఇక విడివిడిగానే ఏపీలో పోరాటాలు చేస్తున్నారు.
అయితే 2024 ఎన్నికలు బిజెపి కాస్తో కూస్తో సీట్లను సంపాదించాలంటే జనసేన సహకారం తప్పనిసరి.అయితే జనసేనతో పొత్తు రద్దు కాలేదని, కలిసే 2024 ఎన్నికలను ఎదుర్కొంటాము అంటూ బిజెపి ప్రకటించింది.

కానీ బిజెపి అగ్ర నేతలు ఎవరూ కనీసం ఢిల్లీకి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు .సోషల్ మీడియాలో పవన్ కి ఢిల్లీ పిలుపు వచ్చినట్టు ప్రచారం జరిగినా.అదంతా ఒట్టిదేనిని తేలిపోయింది.జనసేన, పవన్ వైఖరిపై బిజెపి అగ్ర నేతలకు ఒక క్లారిటీ ఉండడంతోనే ఆయనను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.అసలు ఏపీలో జనసేన ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందనే లెక్కలు, రిపోర్టులు బిజెపి అధిష్టానం కు వెళ్ళడం, తాము ఎంతగా పవన్ , జనసేన కు ప్రాధాన్యం ఇచ్చినా.ఆయన ఎన్నికల సమయంలో టీడీపీ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అనే లెక్కలతో పవన్ విషయాన్ని బిజెపి అగ్ర నేతలు లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు.







