యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి.ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.ఆవారా సినిమాతో మొదలైన ఈయన క్రేజ్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.కార్తీ సినిమా హిట్ టాక్ వస్తే మన టాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లే రాబడుతాయి.కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసాడు.
నాగార్జున తో కలిసి ఊపిరి సినిమా చేసాడు.
ఈ సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.
అందుకే మన వాళ్ళు డబ్బింగ్ సినిమా అయినా ఒరిజినల్ సినిమాలా ఫీల్ అవుతారు.ఇక ఈ మద్యే పొన్నియన్ సెల్వన్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రస్తుతం కార్తీ చేసిన ‘సర్దార్’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
ఈ క్రమంలోనే ప్రొమోషన్స్ లో భాగంగా కార్తీ తన రోల్ గురించి తెలిపాడు.మీడియాతో మాట్లాడిన కార్తీ.” తన కెరీర్ లోనే ఒక ఛాలెంజ్ తో కూడిన రోల్ ఇది అని సినిమాలో రెండు పాత్రలు ఒకదానిని మించి మరొకటి వైవిధ్యంగా సాగుతాయని ఆడియెన్స్ ను ఆద్యంతం ఆకట్టు కుటుందని.

డైరెక్టర్ మిత్రన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని తెలుగు వారు కూడా ఇష్టపడతారు అని తెలిపారు.
ఇక జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
దీపావళి కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు వరుస ప్రొమోషన్స్ చేస్తూ తెలుగులో కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేసారు.ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేయబోతున్నారు.
చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో.







