సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో రకాల అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు మన దర్శక నిర్మాతలు.
అయితే ఇండస్ట్రీలో వెండితెరపై బుల్లితెరపై నటీనటులు ఎంత గ్లామర్ గా కనిపిస్తారో వారు వేసుకునే క్యాస్ట్ రూమ్ కి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు.అంతేకాకుండా వారు గ్లామర్ గా కనిపించాలి అంటే ముఖ్యపాత్ర వహించేది కాస్ట్యూమ్ అని చెప్పవచ్చు.
వెండితెర గురించి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో బుల్లితెరపై నటించే నటీమణులు ఆభరణాలు కాస్ట్యూమ్స్ తో బుల్లితెర పేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.బుల్లితెరపై సీరియల్స్ లో నటించే నటీమణులు హీరోయిన్ స్థాయిలో ఉంటున్నారు.
ఇక సీరియల్స్ లో నటించినే నటీమణులు కాస్ట్యూమ్స్ కూడా చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయి.ఇక మహిళలు సీరియల్స్ లో వారి అభిమాన ధారావాహికలో నటించే నటిమనుల కాస్ట్యూమ్స్ గురించి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాటిని ఫాలో అవుతూ ఉంటారు.
కొంతమంది నటీమణులు సింపుల్గా కనిపిస్తే మరి కొంతమంది మాత్రం నగలతో రిచ్ గా కనిపిస్తూ ఉంటారు.ఆ నగలకు తష్టగట్టుగా కాస్ట్యూమ్స్ అన్ని ధరిస్తూ ఉంటారు.కాగా ఈ మద్య సీరియల్స్ లను భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు.గ్రాఫిక్స్ తో పలు సీరియల్స్ నిర్మిస్తున్నారు.
అంతేకాదండోయ్ అందుకు అనుగుణంగానే కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, వాహనాలు, లొకేషన్స్ ఇలా ఒక్కటేమి అన్ని విషయాల్లో ప్రొడ్యూసర్లు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు.

సీరియల్స్ లో ప్రతి నటీమణి చీరలు, నగలతో ప్రతీ సీన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.అయితే చాలామంది బుల్లితెర ప్రేక్షకులకు వచ్చే ప్రశ్న టీవీ సీరియల్స్ లో నటించే నటీమణులు వాడే చీరలు వారి సొంతమా,లేకపోతే ఆ సీరియల్ యూనిట్ ప్రొవైడ్ చేస్తుందా ఇలా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి.అయితే సాధారణంగా కొంత మంది నటీమణులు ఆ పాత్రకు తగ్గట్టుగా వారి సొంత చీరలే వాడుతుంటారని సమాచారం.
కాగా సీరియల్స్ లో నటీమణులు ధరించే చీరలు, ఆభరణాలు అన్నీ కూడా ఫుల్ కాస్ట్లీ గా ఉంటాయి.కొంతమంది నటీమణుల కోసం ప్రొడక్షన్ వాళ్లే పాత్రకు తగ్గట్టుగా చీరలు డ్రస్సులను డిజైన్ చేస్తూ ఉంటారు.
అయితే కొన్ని సీరియల్స్ సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంటాయి.ఆ సమయంలో సీరియల్ లో నటించిన చీరలను నెలకు రెండు నెలలకు ఒకసారి కడుతుంటారు అని టాక్.
అలా కట్టుకోవడం వల్ల ప్రేక్షకులు కూడా వాటిని పెద్దగా గుర్తుపట్టే అవకాశం కూడా ఉండదని సమాచారం.







