ఒక్కోసారి భార్యాభర్తల మధ్య ఎలాంటి విషయాలలో గొడవలు వస్తాయో తెలుసుకుంటే షాక్ అవ్వక తప్పదు.అసలు అవసరం లేని గొడవలు పెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకునే భార్య, భర్తలు కూడా ఉన్నారు.
తాజాగా ఒక భార్య తన భర్తతో అనవసరంగా గొడవ పడి ఆత్మహత్య చేసుకుంది.స్థానికంగా ఈ ఘటన అందరినీ కలిచి వేస్తోంది.
వివరాల్లోకి వెళితే.ఒడిశాలోని మల్కన్‌గిరిలో నివసిస్తున్న కన్హేయ్ అనే ఒక వ్యక్తి తన భార్య జ్యోతి మండల్‌కు బహుమతిగా ఒక ఖరీదైన ఫోన్ కొనిచ్చాడు.
అయితే దీనిని ఒకేసారి కొనుగోలు చేసేంత స్తోమత తనకు లేక ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాడు.ఇటీవలే ఈఎంఐ కట్టడం కూడా పూర్తయింది.
బ్యాంకు అధికారులు సంతకం తీసుకోవడానికి వచ్చారు.
అప్పుడు ఆమెకు తన భర్త ఈ ఫోన్ ఈఎంఐలో కొనుగోలు చేశాడనే విషయం ఆమెకు తెలిసింది.
తనకు ఎందుకు ఈ విషయం చెప్పలేదని అతన్ని ఆమె నిలదీసింది.నిజానికి వీరికి పెళ్లై కేవలం ఒక సంవత్సరం మాత్రమే గడుస్తోంది.అయినా కూడా మీరు బాగా ఎమోషనల్గా దగ్గరయ్యారని తెలుస్తోంది.అందుకే వద్ద ఈ విషయం ఎందుకు దాచావంటూ ఆమె భర్తతో గొడవకు దిగింది.
అయితే భర్త కూడా సీరియస్ కావడంతో వీరి మధ్య మాటా మాటా పెరిగింది.ఈ క్రమంలోనే జ్యోతి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి విషం తాగింది.

ఇది చూసిన కన్హేయ్ షాక్‌తో నేలపై కుప్పకూలిపోయాడు.వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, జ్యోతి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.కన్హేయ్ ఇంకా షాక్ నుండి కోలుకోలేదు.ఇంకా చికిత్స పొందుతున్నారు.ఈ ఘటన మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల తహసీల్ ఎంపీవీ 14 గ్రామంలో చోటుచేసుకుంది.ఈ విషయం తెలుసుకున్న చాలామంది అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు.
ఓ చిన్న అబద్ధం ఇలా తన భార్య ప్రాణాలను తీసే ఇస్తుందని ఊహించని భర్త ఎప్పుడు కోలుకుంటాడు ఏమో అని చాలామంది బాధను వ్యక్తం చేస్తున్నారు.







