టెక్నాలజీ కంపెనీల వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు డబ్బు సంపాదించడంలోనే కాదు పంచి పెట్టడంలో కూడా అందరి కంటే ముందుంటారు.తమ ఆస్తులను సగభాగానికి పైగా విరాళం ఇచ్చిన వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
కాగా తాజాగా దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ్ నాడార్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.అదేంటంటే, శివ్ నాడార్ 2021-22 మధ్యకాలంలో రూ.1,161 కోట్లు దానం చేశారు. అంటే యావరేజ్ గా డైలీ సుమారు రూ.3 కోట్లను విరాళంగా అందించారు.దాంతో అతను దానాలు చేయడంలో భారతదేశంలోనే టాప్ పొజిషన్‌లో నిలిచారు.
ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ 2022 ఇటీవల ఇండియాలో అత్యధిక దానాలు చేసే వారి లిస్టును విడుదల చేసింది.ఈ లిస్టులో శివ నాడార్ మొదటి ప్లేస్ లో ఉండగా విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ ఏడాదికి రూ.484 కోట్ల దానంతో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.నిజానికి ఈ ఏడాది కాకుండా అంతకు ముందు రెండు సంవత్సరాలు కూడా ఈ లిస్ట్‌లో ప్రేమ్‌జీ తొలిస్థానం సంపాదించారు.
ఈసారి మాత్రం ఆ ప్లేస్‌ను హెచ్‌సీఎల్ ఫౌండర్ కొట్టేసారు.ముఖేష్ అంబానీ అండ్ ఫ్యామిలీ రూ.411 కోట్ల విరాళంతో మూడవ ప్లేస్ సంపాదించారు.

ఇక ఆసియా రిచెస్ట్ మ్యాన్ గౌతమ్ అదానీ రూ.190 కోట్ల దానం చేస్తూ ఈ జాబితాలో 7వ స్థానానికి చేరుకున్నారు.మొన్నీమధ్య అవతరించిన జీరోదా సంస్థ ఫౌండర్స్ నితిన్ కామత్, నిఖిల్ కామత్ ఒకే ఏడాదిలో ఏకంగా రూ.100 కోట్లు దానం చేశారు.నిఖిల్ కామత్ ఈ లిస్ట్‌లో చేరిన అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం.ఇక మరో లిస్ట్‌లో రూ.120 కోట్ల వార్షిక విరాళాలతో మహిళలు కూడా తమ దాతృత్వం చాటుకున్నారు.