హైదరాబాద్ లోని మణికొండలో బ్రౌన్ హెరాయిన్ పట్టుబడింది.115 గ్రాముల బ్రౌన్ హెరాయిన్ ను శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.అనంతరం వెస్ట్ బెంగాల్ కు చెందిన అక్తరుజ్జుమాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.వెస్ట్ బెంగాల్ లోని మాల్దాలో హెరాయిన్ ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
అదేవిధంగా హైదరాబాద్ లోని పలువురికి అక్తరుజ్జుమాన్ హెరాయిన్ ను విక్రయిస్తున్నాడని వెల్లడించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.