మంచు ఫ్యామిలీ గురించి తరచూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరగడం వారి సినిమాల గురించి తీవ్రస్థాయిలో నెగిటివ్ ప్రచారం చేయడం ఎప్పటినుంచో జరుగుతుంది.గత కొద్దిరోజుల క్రితం మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా సమయంలో కూడా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారంటూ వార్తలు వచ్చాయి.
ఇకపోతే విష్ణు నటించిన జిన్నా సినిమా ఇంకా విడుదల కాకుండానే ఈ సినిమా గురించి కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడంతో మంచు విష్ణు ఈ విషయంపై స్పందించి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ చానల్స్ ఉద్దేశపూర్వకంగానే తమ సినిమాని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈయన మండిపడ్డారు.ఈ క్రమంలోనే మంచు విష్ణు ఆ యూట్యూబ్ ఛానల్ లకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ యూట్యూబ్ ఛానల్ ను మంచు విష్ణు ఫెయిడ్ బ్యాచ్ తో పోలుస్తూ వాటి వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన సినిమా గురించి ఇలా దుష్ప్రచారం చేయడంతో త్వరలోనే ఆ యూట్యూబ్ ఛానల్ ను క్లోజ్ చేయిస్తానని ఈ విషయం వారు తెలుసుకుంటే చాలా మంచిది అంటూ ఈ సందర్భంగా ఈయన వార్నింగ్ ఇచ్చారు.దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయడంతో మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విష్ణుకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.







