తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీమేక్ ల సినిమాలు ఎక్కువ అవుతున్నాయి.చిన్న హీరో నుంచి స్టార్ హీరో వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రీమేక్ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు.
అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన కొన్ని రీమేక్ సినిమాలు సూపర్ హిట్ గా మరికొన్ని మాత్రం డిజాస్టర్స్ గా నిలిచాయి.ఇటీవలే విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
అయితే లూసీఫర్ సినిమా తెలుగులోకి కూడా అనువాదమై ఓటిటిలో కూడా అందుబాటులో ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం ఆ సినిమాకు కొన్ని మార్పులు చేసి తెలుగులో విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని భావించారు.
ఈ సినిమా పరవాలేదు అనిపించేలా కలెక్షన్స్ సాధించింది.
ఇలా రీమేక్ సినిమాలు చేసి డిజాస్టర్స్ ని ఎదుర్కొంటున్న హీరోల పరిస్థితిని చూసి కూడా మంచి విష్ణు మళ్ళీ అదే ధైర్యం చేస్తున్నారు.మలయాళ సినిమా ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 సినిమాను మంచు విష్ణు రీమేక్ చేస్తున్నారట.తన తండ్రి మోహన్ బాబు తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాడట విష్ణు.
కాగా 2019లో విడుదల అయిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది.సైంటిఫిక్ ఫిక్షనల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఆహా కొనుగోలు చేసింది.
తెలుగులో ఆండ్రాయిడ్ కట్టప్ప గా అందుబాటులోకి తెచ్చింది.
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆస్వాదించారు.అయితే ఇప్పటికే తెలుగు లోకి అనువాదమైన సినిమాను మళ్లీ మంచు విష్ణు తెలుగు లోనే రీమేక్ చేయడం నిజంగా సాహసమే అని చెప్పవచ్చు.నిజానికి మంచు విష్ణు ఏడు సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేశారట.
వీటిలో ఆండ్రాయిడ్ కుంజప్పన్ ఒకటి.ఈ ఏడు రీమేక్‌లను తానే హీరోగా చేయరట.
కొన్ని సినిమాలు బయట హీరోలతో నిర్మిస్తారని సమాచారం.మరి ఈ సినిమాతో మంచి విష్ణు సక్సెస్ సాధిస్తాడా లేదా చూడాలి మరి.మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.