నెల్లూరు జిల్లా: కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాటూరు నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో వైసీపీ నాయకుల పై మాట్లాడిన తీరును ఖండించారు.
మేము నీ కొడుకులమా మమ్మల్ని చెప్పుతో కొడతావా… ఇలాంటి డైలాగులు సినిమాల్లో చెప్పాలి తప్ప విలువలు కలిగిన రాజకీయాలలో ఈ భాష వాడటం సంస్కృతి సంస్కారం కాదని ఎద్దేవా చేశారు.మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఎప్పుడు సభ్య సమాజం తలదించుకుని భాష వాడలేదని… నేడు పవన్ కళ్యాణ్ మాటలు బాద కలిగించాయని విచారo వ్యక్తం చేశారు.
ఎంతో నిజాయితీగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కొనిదల వెంకటరావు కడుపున చెడపుట్టావని, మాస్ హీరో చిరంజీవి పరువు తీసావు అంటూ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు.నా కొడకా, చెప్పుతో కొడతా అని మేము అనగలం కానీ సంస్కారం మీ కొణిదల కుటుంబం అడ్డొస్తున్నాయని, నువ్వు చంద్రబాబు ఆంధ్రజ్యోతి కలిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని సవాలు విసిరారు.
వైజాగ్ లో పార్టీలకతీతంగా రాజధాని కొరకు ర్యాలీ నిర్వహిస్తుంటే పవన్ కళ్యాణ్ నీకు ఏం పని ఉందనీ వైజాగ్ వెళ్ళావు, ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంటే మరొక పార్టీ మీటింగ్ పెట్టకూడదని రాజకీయ జ్ఞానం లేదు నీకు అని, నువ్వు సినిమాలకి తప్ప రాజకీయాలకు పనికిరావని,నువ్వు చంద్రబాబుతో కాపురం చేస్తావో, లేక ఢిల్లీ వెళ్లి బిజెపితో పడుకుంటావో నీ ఇష్టం అంతేకానీ ఇలాంటి భాష వాడి రాజకీయాలను మలినం చేయవద్దు అని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు.







