కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి సూపర్ స్టార్ గా ఎదిగి తమిళ్ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.అయితే ఈయన తెలుగులో కూడా అదృష్టం పరీక్షించు కునేందుకు రాబోతున్నాడు.
తెలుగులో మార్కెట్ కోసం తమిళ్ డైరెక్టర్ లను పక్కన పెట్టి మరీ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు.ప్రెజెంట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.
తమిళ్ లో ‘వరిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ బైలింగ్వన్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని విజయ్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
కానీ ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా వంశీ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు.
అయినా రెండు రోజులుగా ఈ సినిమా నుండి దీపావళి పండుగ కానుకగా అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్నట్టు.
అది కూడా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ను రెడీ చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు.దీంతో ఈ పండుగ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఇది కేవలం రూమర్ మాత్రమే అని చాలా మంది అనుకున్నారు.కానీ దీనిని నిజం చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విజయ్ ఫ్యాన్స్ కోసం సూపర్ న్యూస్ అందించారు.

తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న రాత్రి గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా పాల్గొన్నారు.అయితే ఈ వేదికపై థమన్ విజయ్ ఫ్యాన్స్ కోసం శుభవార్త చెప్పి వారిని ఆనందంలో ముంచేశారు.దీంతో దీపావళికి ఫస్ట్ సింగిల్ రావడం పక్కా అవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ఇక దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.సంక్రాంతికి ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.