తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం కావడంతో రెండు రోజులు పాటు విఐపి బ్రేక్ దర్శనం దేవస్థానం రద్దు చేసింది.ఈనెల 25వ తారీకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీహరాలను మూసివేసి ఉంటుంది, సర్వదర్శనానికి వేంచేస్తున్న వేలాది మంది భక్తులకు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సర్వదర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం సమయంలో ఇబ్బందులు కలక్కూడదని టీటీడీ దేవస్థానం వారు రెండు రోజులు పాటు విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసిన నేపథ్యంలో సర్వదర్శనం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికే ఈనెల 25, 26వ తేదీల్లో ఎవరైనా విఐపి బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు సిద్ధం చేసుకుని బయలుదేరాలి అనుకునేవారు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకొని , మరొక రోజుకు మార్చుకోవలసినదిగా టీటీడీ వారు సూచించారు.




తాజా వార్తలు