ట్రైన్ జర్నీ చేసే ప్యాసింజర్ల కోసం ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్ ప్రకటించింది.ట్రావెల్ నౌ.
పే లేటర్ ” సదుపాయం కలిపిస్తోంది.అంటే ఇప్పుడు టికెట్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
ఇది ఎలా అని అనుకుంటున్నారా.ఐతే మీకు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
ఫైనాన్షియల్ వెల్నెస్ ప్లాట్ఫామ్ క్యాషే తాజాగా ఇండియన్ రైల్వేస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో ఒప్పందం ఏర్పరచుకుంది.
ఇందులో భాగంగా ట్రైన్ జర్నీ చేసే వారికి ట్రావెల్ నౌ పే లేటర్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్ వాడే వారికి ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.
యాప్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేయదలుచుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని క్యాషే తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.ట్రైన్ టికెట్లను తక్షణం బుక్ చేసుకొని డబ్బులను తర్వాత ఈజీ ఇన్స్టాల్మెంట్లలో చెల్లించొచ్చని క్యాషే చెబుతుంది.
ఈఎంఐ రూపంలో టికెట్ డబ్బులు కట్టొచ్చు.
మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చని చెబుతున్నారు.
రైల్వే ప్రయాణం చేయాలని భావించే వారికి మంచి ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.ఐఆర్సీటీసీ ట్రావెల్ యాప్ లో టికెట్ బుక్ చేసుకొని పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.
అయితే రిజర్వ్, తత్కాల్ ఏ టికెట్ బుక్ చేసుకున్న ఈ బెనిఫిట్ పొందొచ్చు.ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే ఐఆర్సీటీసీ యాప్ ద్వారా క్యాషే అందిస్తున్న ట్రావెల్ నౌ పే లేటర్ సదుపాయం పొందొచ్చు.
ఇక నెక్స్ట్ టైమ్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు.దేశంలోనే అతి పెద్ద ట్రావెల్ నౌ పే లేటర్ ఈఎంఐ పేమెంట్ జర్నీ ఐఆర్సీటీసీతో భాగస్వామ్యంతో ఇది సాధ్యమైంది.
ఈఎంఐ పేమెంట్స్ డిజిటలైజ్ దిశగా మరో అడుగు ముందుకేసిందని క్యాషే ఫౌండర్ చైర్మన్ రమణ కుమార్ తెలిపారు.ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం వల్ల క్యాషే కూడా లక్షల మందికి చేరువుతుందని ఆయన పేర్కొన్నారు.







