ఒత్తైన మరియు పొడవాటి జుట్టు కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఖరీదైన షాంపూ, ఆయిల్స్ వాడుతుంటారు.
తరచూ హెయిర్ ప్యాక్‌లు, మాస్కులు వేసుకుంటారు.అయితే ఒత్తైన మరియు పొడవాటి జుట్టు కావాలంటే పైపై పూతలే కాదు డైట్ లో పోషకాహారాన్ని కూడా చేర్చుకోవాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీ డైట్ లో కనుక ఉంటే మీ జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరగడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.
ముందుగా మూడు ఉసిరి కాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ ముక్కలు, ఒక రెబ్బ ఫ్రెష్ కరివేపాకు, పావు స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పింక్ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే ఉసిరి కరివేపాకు జ్యూస్ సిద్ధం అవుతుంది.
ఈ జ్యూస్ చక్కటి రుచితో పాటు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.ముఖ్యంగా కురుల సంరక్షణకు ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
వారంలో కనీసం మూడు సార్లు ఈ జ్యూస్ ను తీసుకుంటే కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ అదుపులోకి వస్తుంది.జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.చర్మం నిగారింపుగా మెరుస్తుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.