రిషబ్ శెట్టి ఇప్పుడు అంటే కాంతారా సినిమా తరువాత దేశవ్యాప్త సంచలనం అయ్యాడు కానీ ఒకప్పుడు కన్నడ పరిశ్రమ కూడా అతడిని ఎగతాళి చేసింది.నీతో సినిమా తీస్తే అవార్డులు వస్తాయేమో కానీ డబ్బు లు రావు అని.
మొదటగా రిషబ్ శెట్టి రికి సినిమా తీసాడు.అది పెద్ద హిట్ కొట్టడం తో కిరిక్ పార్టీ సినిమాకు పూనుకున్నాడు.
ఈ సినిమాలకు హీరో రక్షిత్ శెట్టి. తాను ఏం చేసిన, ఏం చెప్పిన గుడ్డిగా నమ్మే రక్షిత్ శెట్టి రిషబ్ శెట్టి కి మంచి స్నేహితుడు.
కిరిక్ పార్టీ సినిమా కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో వచ్చి యాభై కోట్లు వసూల్ చేసింది.ఈ సినిమా తర్వాత ఎంతో మంది రిషబ్ ఇంటికి క్యూ కట్టారు.
ఎన్ని కోట్లు అయినా ఇస్తాము మాకొక సినిమా తీసి పెట్టు అంటూ ఒత్తిడి చేసేవారు.తాను అప్పటికే ఒక కథను రాసి పెట్టుకున్నాడు.మనం డైలీ న్యూస్ పేపర్ లో వచ్చే వార్తలను చూస్తాం, వదిలేస్తాం.కానీ ఒక ప్రభుత్వ పాఠశాల మూసివేసే వార్త రిషబ్ ని కదిలించింది.
ఇలాంటి వార్తలు కొన్ని వందలు చదివిన చాల మందిలో ఎలాంటి చలనం ఉండదు.కానీ అక్కడ ఉంది రిషబ్.
అందుకే ఆ చిన్న న్యూస్ అతడికి ఒక కథ వస్తువుగా మారింది.అప్పటికి రిషబ్ తీసింది రెండు సినిమాలు మాత్రమే.
మూడో సినిమా కర్ణాటక లో మూసివేయబోతున్న ఒక స్కూల్ ని పిల్లలు ఎలా మూయకుండా కాపాడుకున్నారో చూపించడం.
ఈ సినిమా కథను తన దగ్గరికి వస్తున్న నిర్మాతలకు చెప్తే అందరు వెక్కిరించి వెళ్లిపోయారు.
ఈ కథ తీస్తే డబ్బులు రావు అంటూ ఎగతాళి చేసారు.కానీ రిషబ్ ఒక మొండి వ్యక్తి తాను అనుకున్న కథ తోనే కేరళ- కర్ణాటక సరిహద్దులో ఉన్న కసరగుడు అనే చిన్న పల్లెటూళ్ళో కన్నడ మీడియం సర్కారీ స్కూల్ పై మూడు కోట్ల బడ్జెక్టు తో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల() అనే పేరు పెట్టి తీసాడు.కానీ ఈ సినిమాకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి.అందుకే క్రౌడ్ ఫండింగ్ చేసాడు.అందరు సినిమా పై ఉన్న ప్రేమలు పది, ఇరవై ఇస్తే అవి కూడబెట్టి మూడు కోట్లు చేసి సినిమాను విడుదల చేసాడు.ఎంత రెమ్యునరేషన్ అయినా సరే ఇస్తాము అని ఎంతో మంది వచ్చిన కూడా కాదని ఈ సినిమా తీసి 20 కోట్లు వసూళ్లు సాధించాడు.
ఈ సినిమాను సైతం కన్నడిగులు తమ గుండెల్లో పెట్టుకున్నారు.