మూడు రోజుల్లో కాంతార సినిమాతో అల్లు అరవింద్ ఎన్ని కోట్లు లాభం పొందారో తెలుసా?

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రం కాంతార.సెప్టెంబర్ 3వ తేదీ కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Producer Allu Aravind Kantara Movie Profits,allu Aravind,kantara,three Days Coll-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు హక్కులను కొనుగోలు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ విడుదల కాగా మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది.
కన్నడ సినిమా తెలుగు హక్కులను అల్లు అరవింద్ కేవలం రెండు కోట్ల రూపాయలకే కొనుగోలు చేశారు అయితే ఈ సినిమా మూడు రోజులలో భారీ లాభాలను అందుకుందని తెలుస్తుంది.ఈ సినిమా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మూడు రోజులకు గాను ఏకంగా 6.80 కోట్ల రూపాయల షేర్స్ రాబట్టింది అలాగే 13.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.ఇలా రెండు కోట్లకు కొనుగోలు చేయగా ఈ సినిమా ఏకంగా నాలుగు కోట్ల రూపాయల లాభాలను తీసుకువచ్చింది.ఈ విధంగా మూడు రోజులకే నాలుగు కోట్ల లాభం అంటే మామూలు విషయం కాదు.

Telugu Allu Aravind, Kantara, Rishab Shetty, Sapthami Gowda, Days-Movie

ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన ఈ సినిమా హవా కొనసాగుతోంది.ఇక ఈ సినిమా ముగిసేనాటికి ఎంతో సులభంగా పది నుంచి 15 కోట్ల వరకు లాభాలను రాబడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.ఏది ఏమైనా అల్లు అరవింద్ మాత్రం అత్యంత తక్కువ ధరలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా తెలుగులో విడుదల చేయడంతో ఈ సినిమా ప్రభావం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై పడిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube