తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 ఆరోవారం ఎలిమినేషన్స్ లో భాగంగా సుదీప ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.అయితే సుదీప ఎలిమినేట్ అయినట్టు రెండు రోజుల ముందే వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే.
ఇక ఆరో వారం ఎలిమినేషన్ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని వస్తే.ఎంట్రీ ఇవ్వడంతోనే కాసేపు గీతూనే ఒక ఆట ఆడుకున్నారు.
ఆ తర్వాత వయసు అయిపోయిన చిరుత అంటూ బాలాదిత్యా పై పంచులు వేశాడు నాగ్.

ఇక ఆరో వారం నామినేషన్ లో రాజ్, సుదీప, బాలాదిత్య, గీతు, మెరీనా, శ్రీ హాన్, ఆది రెడ్డి లు ఉన్నారు.వారందరితో కలిసి ఒక టాస్క్ ని ఆడించాడు.ఆ తరువాత ఆట సాగుతున్న మధ్యలో ఎలిమినేషన్ ప్రక్రియను కూడా తీసుకోవచ్చారు నాగ్.
ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా సేఫ్ అవుతూ చివరికి బాలాదిత్య సుదీప మాత్రమే మిగిలారు.సుదీప ఎలిమినేట్ అవ్వడంతో బాలాదిత్యా మెరినా ఎమోషనల్ అయ్యారు.సుదీప ఎమోషనల్ అవ్వకుండా నవ్వుతూనే అందరికీ బాయ్ బాయ్ చెప్పి బయటకు వచ్చేసింది.ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సుదీపకు తన జర్నీని ఏవి రూపం లో చూపించాడు నాగార్జున.

ఆ తర్వాత స్టేజ్ పై ఒక కూరగాయల బండి పెట్టి ఇందులో కూరగాయలు పెట్టి లక్షణాన్ని తగ్గట్టు పేర్లు ఎవరికి సూట్ అవుతాయి అన్నది చెప్పమన్నారు.మొదట మిరపకాయ తీసుకున్న సుదీప రేవంత్ కి చూపించింది.అయితే హౌస్ లో ఉన్నప్పుడు కిచెన్ దగ్గర రేవంత్ తో దీప గొడవ పడిన విషయం తెలిసిందే.అప్పుడు రేవంత్ తాను కెప్టెన్ అయితే అందరినీ మార్చి పారదొబ్బుతా అని అన్నాడు.
ఆ మాటలను గుర్తు చేసుకున్న సుదీప మార్చిపడేస్తా అన్నావుగా కిచెన్ టీం పాపం నీకు ఆ ఛాన్స్ రాలేదు.మార్చి పాడదొబ్బుతా అన్నావు అంటూ నవ్వుతూనే అతనిపై సెటైర్లు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుదీప.







