తిరుపతి జిల్లా నగరి వైసీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.నిండ్ర మండలం కొప్పెడులో రైతు భరోసా కేంద్రానికి మంత్రి రోజా వ్యతిరేకవర్గం భూమి పూజ చేసింది.
అయితే సంప్రదించకుండా భూమి పూజ చేయడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.దీనికి నిరసనగా వాట్సాప్ గ్రూపులో మంత్రి రోజా ఆడియో విడుదల చేశారు.
పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పని చేస్తున్నామన్న ఆమె.ఇలాంటి కార్యక్రమాలతో పార్టీకి, తనకు నష్టం కలిగించొద్దని చెప్పారు.ఇలాంటి నేతలను ప్రోత్సహించడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.







