కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈజిప్ట్‌లో పర్యటిస్తున్నారు.తన పర్యటనలో భాగంగా కైరోలో స్థిరపడిన అక్కడి ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వున్న చారిత్రాత్మక బంధంపై ఆయన చర్చలు జరిపారు.అలాగే భారతదేశంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరివర్తనాత్మక మార్పులపైనా మాట్లాడారు.
భారత్‌లో వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో వున్న అవకాశాలపైనా జైశంకర్ వివరించారు.
మరోవైపు.
చాలాకాలం తర్వాత భారత్ నుంచి ఈజిప్ట్ గోధుమలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించడం ఈ ఏడాది చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల్లో ఒకటిగా జైశంకర్ తెలిపారు.భారత్- ఈజిప్ట్ మధ్య సంబంధాలు బాగున్నాయని.
అవకాశాలు కూడా ఎక్కువగా వున్నాయని జైశంకర్ నొక్కిచెప్పారు.భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుతూ.
ఈజిప్ట్‌లోనూ దేశ ప్రతిష్టను పెంపొందిస్తోన్నందుకు ప్రవాస భారతీయులకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.భారతదేశం ప్రస్తుతం అనేక దేశాలకు ఆరోగ్య కేంద్రంగా మారిందన్నారు.
గల్ఫ్, తూర్పు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుంచి వైద్య అవసరాల కోసం భారత్‌కు వచ్చే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు.

కైరోలోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్ ప్రకారం ఈజిప్ట్‌లో దాదాపు 3,200 మంది భారతీయులు వున్నారు.వీరిలో ఎక్కువ మంది కైరో పరిసరాల్లోనే కేంద్రీకృతమై వున్నారు.అలెగ్జాండ్రియా, పోర్ట్ సెయిడ్, ఇస్మాలియా తదితర నగరాల్లోనూ భారతీయులు స్థిరపడ్డారు.
ఈజిప్ట్‌లో స్థిరపడిన భారతీయులలో ఎక్కువమంది అక్కడి భారతీయ కంపెనీలలో లేదా బహుళజాతి సంస్థలలో పనిచేస్తున్నారు.దాదాపు 400 మంది భారతీయ విద్యార్ధులు ఈజిప్ట్‌లో చదువుతున్నారు.
ప్రధానంగా అల్ బజార్ యూనివర్సిటీలో దాదాపు 275 మంది విద్యార్ధులు, మిగిలిన వారు ఐన్ షామ్స్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.








