సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున కొనసాగుతుంది అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరోలు ఈ డ్రగ్ ఉచ్చులో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
అయితే తాజాగా ఈ డ్రగ్స్ గురించి బాబా రాందేవ్ చేసినటువంటి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు కొందరు డ్రగ్స్ సేవిస్తున్నారంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బాబా రాందేవ్ ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఆర్యవీర్, వీరాంగన సభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ డ్రగ్స్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుందని ఈయన ఆరోపణలు చేశారు.కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి కూడా ఈ డ్రగ్ మాఫియా ఎంట్రీ ఇచ్చింది అంటూ ఈయన పెద్ద ఎత్తున డ్రగ్స్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావిస్తూ ఈయన డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆయన కుమారుడు కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయాన్ని ఈయన ప్రస్తావించారు.ఇక అమీర్ ఖాన్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ అమీర్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారో లేదో తనకు తెలియదని బాబా రాందేవ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్నికల సమయంలో కూడా డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని ఈయన తెలిపారు ఈ క్రమంలోనే భారతదేశాన్ని మాదకద్రవ్యాల నుంచి విముక్తి పొందేలా ఉద్యమం చేపట్టాలంటూ పిలుపునిచ్చారు.







