కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును ఆపేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కరోనా వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.సుమారు 1.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు ప్రస్తుతం నిల్వ ఉన్నాయని వెల్లడించింది.ఇప్పుడు నిల్వ ఉన్న డోసులు మరో ఆరు నెలల వరకు సరిపోతాయని చెప్పింది., ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి వ్యాక్సిన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది.
బయట మార్కెట్లోనూ కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈ ఏడాది వైద్యశాఖకు కేటాయించిన రూ.5 వేల కోట్లలో 4,237.14 కోట్లను తిరిగి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.ఈమేరకు వైద్యశాఖ నుంచి ఆర్థిక శాఖకు నిధుల బదిలీ కూడా పూర్తయినట్లు సమాచారం.







