మహేష్ బాబు సినిమాలలో నమ్రతకు ఇష్టమైన మూవీ ఏదో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు ఈ మధ్య కాలంలో కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు మహేష్ బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

 Namrata Favourite Movie In Mahesh Babu Cine Career Details Here Goes Viral In So-TeluguStop.com

అయితే మహేష్ సినిమాలలో నమ్రతకు ఇష్టమైన సినిమా ఏంటనే ప్రశ్నకు సమాధానం అభిమానులలో కూడా చాలామందికి తెలియదు.

నమ్రత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో గంటలో ప్రపంచం అంతమైపోతుందంటే మహేష్, పిల్లలతో చివరి క్షణాలు గడపటానికి ఇష్టపడతానని నమ్రత వెల్లడించారు.

కృష్ణ, మహేష్ లలో నచ్చిన యాక్టర్ ఎవరనే ప్రశ్నకు నమ్రత స్పందిస్తూ వాళ్లిద్దరినీ కంపేర్ చేసి చెప్పడం నాకు సాధ్యం కాదని నాకు ఇద్దరూ ఇష్టమేనని ఆమె అన్నారు.మహేష్ బాబు సినిమాలలో పోకిరి ఇష్టమని నమ్రత పేర్కొన్నారు.

ముంబై, హైదరాబాద్ లలో ఇష్టమైన సిటీ ఏంటనే ప్రశ్నకు నాకు రెండు సిటీలు ఇష్టమని ముంబైలో నేను పెరిగానని పెళ్లి చేసుకుని ప్రస్తుతం నివశిస్తున్నాను కాబట్టి హైదరాబాద్ కూడా ఇష్టమేనని నమ్రత కామెంట్లు చేశారు.మహేష్ బాబు భార్యగా ఉండటానికే నేను ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు.

నా బెస్ట్ ఫ్రెండ్ మహేష్ బాబు అని నమ్రత కామెంట్లు చేశారు.

Telugu Mahesh Babu, Namrata, Pokiri-Movie

మహేష్ బాబు, మంజులకు నాకు సంబంధించిన ప్రతి విషయం తెలుసని నమ్రత చెప్పుకొచ్చారు.మంజుల మంచి ఆర్టిస్ట్ అని నమ్రత పేర్కొన్నారు.మంజుల రీల్ లైఫ్, రియల్ లైఫ్ కు పెద్ద తేడా ఏమీ ఉండదు అని నమ్రత తెలిపారు.

మావయ్య పెద్ద సూపర్ స్టార్ అని నటన అనేది వాళ్ల రక్తంలోనే ఉందని నమ్రత చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube