ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రకాశం జిల్లాకు చెందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం టీవీ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చి సక్సెస్ అయ్యారు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం సొంతూరు ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం కాగా నాటకాలపై ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి ఎంతో ఆసక్తి ఉండేది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్నేహితుడు అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2004 సంవత్సరంలో కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ గెలుపు కోసం తన వంతు కష్టపడ్డారు.
దాదాపుగా పది సంవత్సరాల పాటు ఏపీ సాంస్కృతిక కార్యదర్శిగా ఆయన పని చేశారు.కాలేయ క్యాన్సర్ తో బాధ పడుతూ 2013 సంవత్సరం డిసెంబర్ నెల 7వ తేదీన ధర్మవరపు సుబ్రహ్మణ్యం మృతి చెందారు.
ధర్మవరపు బ్రతికి ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మా ఊరు ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉందని మా ఊరినుంచి బస్సు ఎక్కి వెళ్లాలంటే 15 కిలోమీటర్లు వెళ్లాలని ఆయన అన్నారు.
నా నైజం సీరియస్ నెస్ నా వృత్తి హాస్యం అని ధర్మవరపు తెలిపారు.రాజకీయాలు అంటే బురదే అని అయితే అంటకుండా కూడా ఉండవచ్చని ఆయన అన్నారు.నేను పదవిని ఆశించలేదని రాజశేఖర్ రెడ్డి పిలిచి నాకు పదవి ఇచ్చారని ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలిపారు.
700కు పైగా సినిమాలలో నేను నటించానని ఆయన చెప్పుకొచ్చారు.రాజశేఖర్ రెడ్డి సినిమాలు ఎక్కువగా చూసేవారు కాదని నేనే ఎప్పుడైనా యాడ్ ఫిల్స్మ్ లేదా సినిమా షోలకు రాజశేఖర్ రెడ్డిని లాక్కెళ్లేవాడినని ఆయన అన్నారు.వైఎస్సార్ తనకు ఎంతో సన్నిహితుడని ఆయన వెల్లడించారు.
సాయంత్రం 6 గంటల తర్వాత ఒక స్టార్ హీరో సినిమా డబ్బింగ్ కరెక్షన్ కు పిలిస్తే నేను వెళ్లలేదని ధర్మవరపు కామెంట్లు చేశారు.