భారతదేశంలో ఆవులను పవిత్రంగా పరిగణిస్తారు.వాటికి నిత్యం పూజలు కూడా చేస్తారు.
అందుకే గోవులకు ఏమైనా జరిగిందంటే వాటిని పూజించే హిందువులు అల్లాడిపోతారు.దేవతామూర్తులుగా గోమాతను కొలిచే వారికి గోవులకు ఏదైనా హాని జరిగితే తట్టుకోలేరు.
కొందరు అయితే సంఘాలుగా ఏర్పడి గో మాంస భక్షణను అడ్డుకుంటుంటారు.ఇవి కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతుంటాయి.
ఏదేమైనా గోవులను హింసించడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు.
తాజాగా ఓ వ్యక్తి గోమాత పట్ల కర్కశంగా ప్రవర్తించాడు.
తాళ్లతో దానిని కట్టేసి, విచక్షణా రహితంగా దాడి చేసి రాక్షసానందం పొందాడు.అయితే అతడి ఆనందం కాసేపటికే ఆవిరి అయిపోయింది.
అతడికి కోలుకోలేని దెబ్బ తగిలింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇది నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది.అంతేకాకుండా వారి మతపరమైన మనోభావాలను కూడా దెబ్బతీసింది.ఈ వీడియోను ‘ఘర్కేకలేష్’ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
దానికి ఇప్పటికే 48 వేలకు పైగా వ్యూస్ దక్కాయి.కట్టిన ఆవు తాడును ఒక వ్యక్తి దూరం నుండి లాగాడు.
మరొక వ్యక్తి ఆవు దగ్గర నిలబడి ఆవు కదలనందుకు దారుణంగా తన్నాడు.ఆవుపై గట్టిగా తన్నిన తర్వాత, మనిషి తన చేతిలోని ఆవు తోకను దూకుడుగా తిప్పాడు.
ఆవు అతని కోసం దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.కానీ ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు.
తన చేతిలోని తాళ్లతో దానిని బాగా కొట్టాడు.దానిని చాలా బాధించాడు.
చివరికి ఆ గోవు తిరగబడింది.పట్టరాని కోపంతో ఆవ్యక్తిపై దాడి చేసింది.కింద పడేసి, ఆ వ్యక్తిని తమ కొమ్ములతో కుమ్మి పడేసింది.దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవించాలని, తిక్క కుదిరిందని అంటున్నారు.గోమాత అతడికి బాగా బుద్ధి చెప్పిందని కామెంట్లు చేస్తున్నారు.