ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక పేరు బాగా వినిపిస్తుంది.ఆమె మరెవరో కాదు తాన్య రవిచంద్రన్.
మన తెలుగు జనాలకు ఇంతకు ముందు వరకు ఈమె ఎవరో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులర్ గా కనిపిస్తుంది.ఇక కోలీవుడ్ లో అయితే ఈమె ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ అని చెప్పాలి.
వాస్తవానికి ఈమె తమిళ సీనియర్ నటుడైన రవి చంద్రన్ కి మనవరాలు.దాంతో ఆమెకు సినిమా ఇండస్ట్రీలో ప్రవేశం సులువుగానే జరిగింది.
తాత పేరు చెప్పుకొని అవకాశాలు సంపాదించిన తాన్య తొలుత 2016లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బల్లే వెళ్ళైయితేవా అనే ఒక తమిళ చిత్రం ద్వారా ఆమె మొదట వెండితెరపై దర్శనం ఇచ్చింది.
ఇక తెలుగు సినిమా విషయానికొస్తే ఆమె 2021లో కార్తికేయ సరసన హీరోయిన్ గా రాజా విక్రమార్క సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
అయినా ఈ సినిమా పరాజయం పాలవడంతో తాన్య ని తెలుగు ప్రేక్షకులు అసలు గుర్తు పెట్టుకోలేదు.కానీ తమిళనాడు లో మాత్రం ఈ అమ్మడికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
డాన్సర్ గా ఈమెకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు.

ఇక తాన్య ఆ రీసెంట్ గా చిరంజీవి సూపర్ హిట్ అయిన సినిమా గాడ్ ఫాదర్ లో నటించడంతో ఈమె ఎవరో తెలుసుకోవాలని సోషల్ మీడియా లో వెతుకులాట ప్రారంభమైంది.గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార పొలిటిషన్ గా నటించగా ఆమెకు చెల్లెలుగా తాన్య నటించింది.

దాంతో ప్రస్తుతం అందరూ తనని గుర్తు పడుతున్నారు.ఇక తాన్య కి కోట్ల ఆస్తులున్నా కూడా సినిమా ఇండస్ట్రీలోనే రాణించాలనే ఇంట్రెస్ట్ తో ఇటువైపు అడుగులు వేసింది.చదువులో మేటి గా ఉన్న తాన్య హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో హెచ్ఆర్ గా పనిచేసింది.
ఎంతో సాదాసీదాగా ఉండడంతో ఈమెను ఎక్కువగా జనాలు ఇష్టపడుతున్నారు.చూడాలి మరి రానున్న కాలంలో ఎన్ని తెలుగు సినిమాల్లో నటిస్తుందో.