జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్..!!

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ముఖ్యంగా విద్య మరియు వైద్య రంగంలో సీఎం జగన్ ఆలోచనలను చాలామంది ప్రశంసిస్తూ ఉన్నారు.

 British Deputy High Commissioner Congratulated Jagan's Government , British Depu-TeluguStop.com

పేదవారికి విద్య మరియు వైద్యం భారం కాకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాల పట్ల మంచి పాజిటివ్ స్పందన వస్తూ ఉంది.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమాలను దేశంలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ప్రజలకు అందించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా విద్య మరియు వైద్యరంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషి… అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

ఈ రెండు రంగాలలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై బ్రిటిష్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధానం యూకే లో ఉందని.అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏపీలో కూడా అమలు చేయాలన్న ఆలోచన ప్రణాళిక కూడా చాలా బాగుంది అని అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube