స్టార్ హీరోయిన్ పూజా హెగ్దేతో డైరక్టర్ హరీశ్ శంకర్ దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేశాడు హరీశ్ శంకర్.ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విసెష్ చెప్పి పూజాతో దిగిన రెండు సెల్ఫీ ఫోటోస్ ని షేర్ చేశాడు.
అంతేకాదు త్వరలో సెట్స్ లో కలుద్దాం అని కూడా కామెంట్ పెట్టాడు.హరీశ్ శంకర్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా లో పూజా హెగ్దేని హీరోయిన్ గా అనుకున్నారు.
కానీ ఆ సినిమా ఇప్పటికీ పట్టాలెక్కలేదు.అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు అనుకున్నారు.
కానీ హరీశ్ శంకర్ ట్వీట్ తో భవదీయుడు సినిమా ఉంటుందని నమ్మకం కలిగింది.పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండిటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు.
ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.అయితే 2024 ఎన్నికలు ఉంటే మాత్రం ఏడాదిన్నర పాటు పవన్ సినిమాలకు దూరం కాక తప్పదు.
మరి హరీశ్ శంకర్ సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.అయితే హరీశ్ శంకర్ మాత్రం పూజా కి పెట్టిన మెసేజ్ లో త్వరలోనే కలుద్దాం అనడం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.