నాగార్జున ఏం పీకావ్ అన్నారు... ఈసారైనా పీకుదామని.. ఆదిరెడ్డి కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం మొదట్లో కాస్త బోర్ అనిపించినప్పటికీ వారాలు గడిచేకొద్దీ ఈ కార్యక్రమం పై తీవ్ర స్థాయిలో ఆసక్తి ఏర్పడుతుంది.కంటెస్టెంట్ల మధ్య పోటాపోటీగా టాస్కులు జరుగుతుండడంతో ఈ కార్యక్రమం ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Bigg Boss 6 Contestant Adireddy Bold Comments Viral Details, Nagarjuna,adireddy,-TeluguStop.com

ఇకపోతే ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరవ వారం కూడా పూర్తి కానుంది.ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఆఖరి వరకు ఆగని పరుగు అనే టాస్క్ ఇచ్చారు.

ఈ టాస్క్ లో భాగంగా వాసంతి ఆదిరెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది.ఇలా ఈ ఇద్దరిలో ఇంటి సభ్యులు ఎవరిని ఎక్కువగా ఎన్నుకుంటే ఎన్నికైన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు.

అయితే వాసంతి ఆదిరెడ్డి ఇద్దరు ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో కూడా తెలపాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఆదిరెడ్డి మాట్లాడుతూ కెప్టెన్సీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఇక ఆది రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను ఒకసారి కెప్టెన్ అయ్యానని తెలిపారు.

Telugu Vasanthi, Adi, Bb Adi, Bigg Boss, Bigg Boss Ups, Nagarjuna-Movie

అయితే అప్పుడు కెప్టెన్ గా ఉన్నప్పుడు నాగార్జున గారు నువ్వేం పీకావు అని ప్రశ్నించారు.అందుకే ఈసారైనా అవకాశం ఇస్తే పీకుదాం అని అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ కాస్త బోల్డ్ గా అనిపించిన ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే వాసంతి సైతం ఎందుకు కెప్టెన్ అవ్వాలనుకున్నారో చెప్పారు.

అయితే కొందరు ఇంటి సభ్యులు వాసంతికి సపోర్ట్ చేయగా మరి కొందరు ఆదిరెడ్డికి సపోర్ట్ చేశారు.మొత్తానికి ఆదిరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube