నాగార్జున ఏం పీకావ్ అన్నారు... ఈసారైనా పీకుదామని.. ఆదిరెడ్డి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం మొదట్లో కాస్త బోర్ అనిపించినప్పటికీ వారాలు గడిచేకొద్దీ ఈ కార్యక్రమం పై తీవ్ర స్థాయిలో ఆసక్తి ఏర్పడుతుంది.
కంటెస్టెంట్ల మధ్య పోటాపోటీగా టాస్కులు జరుగుతుండడంతో ఈ కార్యక్రమం ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరవ వారం కూడా పూర్తి కానుంది.
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఆఖరి వరకు ఆగని పరుగు అనే టాస్క్ ఇచ్చారు.
ఈ టాస్క్ లో భాగంగా వాసంతి ఆదిరెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇలా ఈ ఇద్దరిలో ఇంటి సభ్యులు ఎవరిని ఎక్కువగా ఎన్నుకుంటే ఎన్నికైన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు.
అయితే వాసంతి ఆదిరెడ్డి ఇద్దరు ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో కూడా తెలపాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఆదిరెడ్డి మాట్లాడుతూ కెప్టెన్సీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఇక ఆది రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను ఒకసారి కెప్టెన్ అయ్యానని తెలిపారు.
"""/"/ అయితే అప్పుడు కెప్టెన్ గా ఉన్నప్పుడు నాగార్జున గారు నువ్వేం పీకావు అని ప్రశ్నించారు.
అందుకే ఈసారైనా అవకాశం ఇస్తే పీకుదాం అని అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ కాస్త బోల్డ్ గా అనిపించిన ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే వాసంతి సైతం ఎందుకు కెప్టెన్ అవ్వాలనుకున్నారో చెప్పారు.అయితే కొందరు ఇంటి సభ్యులు వాసంతికి సపోర్ట్ చేయగా మరి కొందరు ఆదిరెడ్డికి సపోర్ట్ చేశారు.
మొత్తానికి ఆదిరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!