దేవుడా మా తెలుగు సినిమాకు పట్టిన దరిద్రం ఎప్పుడు పోతుంది.అరువు తెచ్చుకున్న కథలు, రీమేకుల హడావిడి తప్ప తెలుగు వాళ్లకు కథ రాసే సత్తా లేదా ? ఆహా ఓహో అని పొగిడించుకుంటున్న తెలుగు సినిమా వారికి అసలు సొంతంగా ఒక కథ రాసుకునే అవసరం లేదా ? తమిళం వాళ్ళు పొన్నియన్ సెల్వం సినిమా తీసి గుండెల్లో పెట్టుకున్నారు.మిగతా భాషల్లో ఫ్లాప్ అయినా కూడా తమ సొంత సినిమాకి వారు బ్రహ్మ రధం పట్టుకున్నారు.ఇక కర్ణాటక లో అయితే కాంతారా మూవీ.కన్నడిగులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.వారి సొంత సినిమాపై వారి అభిమానం చూస్తుంటే కర్ణాటక అంత గర్వం తో ఉప్పొంగి పోతుంది.
అక్కడ అంత ఇప్పుడు ఒక సినిమా జాతర జృటున్నంత సందడి ఉంది.
మరి మన తెలుగు వారికి ఏమైంది.
తెలుగు కథలు, సంస్కృతి, ఆట, పాట ను తెలుగు జాతి గర్వపడేలా ఒక్క సినిమా తీయలేమా ? తీస్తే తెలుగు వారు ఆదరించారు అని భయమా ? లేదా తెలుగు సంస్కృతి పై సినిమా తీస్తే డబ్బులు రావేమో అని బెంగానా? ఏది ఏమైనా మన హీరోస్వామ్య సినిమా ఇండస్ట్రీ లో షూటింగ్ జరుగుతుంటే ఆఖరికి చాయి ఇచ్చేవాడు కూడా ఎవరు ఉండాలో హీరోనే నిర్ణయిస్తాడు.హీరోను కాదని ఎవరు ఏమి చేయలేరు.
ఆఖరికి దర్శకుడు కూడా ఒక దిష్టి బొమ్మ మాత్రమే.ఒక వేళా సినిమా ఫ్లాప్ అయితే ఆ బరువు మోయడానికి ఒక బకరా కావాలి కదా.అరువు తెచ్చుకున్న, అక్కరకు రాని బిల్డప్పులతో సినిమాలు తీసి ఓహో మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది అని జబ్బలు చేర్చుకోవడం తప్ప.
ఎక్కడో హిట్ అయినా ఒక సినిమా కథను ఎత్తుకచ్చి మన తెలుగు హీరోల మసాలా, బిల్డప్ లు జోడించి బ్లాక్ బస్టర్ అంటూ భజన చేసుకోవడం బాగా అలవాటయిపోయింది.ఇక ఆ సినిమా తీస్తే అసలు స్టోరీ రాసిన వాడు గుండె ఆగి చావాల్సిందే.అంతగా భజనతో నిండిపోయి ఉంటుంది.
ఇక కొంతలో కొంత మన బాలయ్య, వెంకటేష్ నయ్యం అనే చెప్పాలి.అఖండ సినిమాలో అగోర ఎందుకు మోడరన్ ఉన్నాడో తెలియదు కానీ పాత్ర మలిచిన తీరు, ఆ ప్రయోగం ఒక అద్భుతం అనే చెప్పాలి.
ఇక నారప్ప పాత్రలో మన వెంకటేష్ ఎంతో చక్కగా నప్పాడు.మరి ఇలాంటి నటులతో ఇక్కడ కథలను తయారు చేసి మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కరు భేష్ అంటారు.