ఎన్టీఆర్ జిల్లాలో లోన్ యాప్ వేధింపులు తాళలేక మరో యువకుడు బలయ్యాడు.విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో లంక మణికంఠ అనే యువకుడు లోన్ యాప్ ఏజెంట్ల బెదిరింపులకు గురయ్యాడు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మణికంఠ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషా తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఈ ఘటనపై పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఏసీపీ వెల్లడించారు.