వి వి వినాయక్ తో సినిమా చేయడానికి ముప్పు తిప్పలు పెట్టిన తారక్.. కథ ఏంటి ?

వివి వినాయక్ .మనందరికి తెలిసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.

 Why Tarak Not Intrested To Work With Vv Vinayak, Tarak , Vv Vinayak , Hyderabad-TeluguStop.com

ఇప్పుడు అయితే సరైన సక్సెస్ లేక డీలా పడ్డాడు కానీ వి వి వినాయక్ క్రేజ్ ఆ మధ్య కాలంలో మాములుగా ఉండేది కాదు.అయితే అతడికి మాస్ దర్శకుడిగా మాత్రం పేరు వచ్చింది తన తొలి సినిమా ఆది నుంచి.

ఆ సినిమా తీసిన తరువాత వినాయక్ కి స్టార్ హీరోల నుంచి పిలుపులు పచ్చాయి.అయితే వినాయక్ మాత్రం అంత ఈజీ గా ఏమి స్టార్ డైరెక్టర్ అయిపోలేదు.

అప్పుల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉండాల్సిన టైం లో ఇంట్లో అందరికి దైర్యం చెప్పి ఒక పెట్టె పట్టుకొని హైదరాబాద్ వచ్చి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.

Telugu Aadi, Hyderabad, Ntr, Kodali Nani, Srinu Whitela, Subbu, Tarak, Vv Vinaya

ఇక తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో నల్లమలుపు బుజ్జి, శ్రీను వైట్ల వంటి వారితో స్నేహంగా ఉండేవాడు.అందరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండేవారు.ఒకరి టాలెంట్ మరొకరికి బాగా తెలుసు.

అందుకే వీరు స్నేహితులు అయ్యారు.ఇక నల్లమలుపు బుజ్జికి కోడలి నాని తో కూడా స్నేహం ఉండేది.

కోడలి నాని ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఎంతో స్నేహం గా మెలిగేవాడు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ని ఒక మాస్ హీరోగా చూడాలని కోడలి నాని అనుకున్నాడు.

దాంతో నల్లమలుపు బుజ్జి దగ్గర వినాయక్ గురించి తెలుసుకొని తారక్ కి కథ చెప్పమని అన్నాడట.కానీ తారక్ కి ఎందుకో అప్పట్లో వినాయక్ పెద్దగా నచ్చలేదు.

Telugu Aadi, Hyderabad, Ntr, Kodali Nani, Srinu Whitela, Subbu, Tarak, Vv Vinaya

కథ చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదోలా తప్పించుకునేవాడు.కోడలి ఎంత చెప్పిన కూడా వినాయక్ తో కథ వినడానికి తారక్ సిద్ధంగా లేడు.సరిగ్గా అదే సమయంలో స్టూడెంట్ నం.1 , నిన్ను చూడాలని, సుబ్బు వంటి స్టూడెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఉన్నాడు తారక్.సరైన కథ కోసం వెతుకుతున్నాడు.కోడలి నాని బలవంతం చేస్తుండటం తో ఓ సరి విని కథ బాగాలేదు అని చెప్పి తిప్పి పంపిందం అనుకున్నాడట.కానీ వి వి వినాయక్ చెప్పిన కథ విన్న తారక్ ఈ సినిమా నేను మాత్రమే చేయాలి అని పట్టు బట్టాడు.ఆలా రూపుదిద్దుకున్న సినిమా ఆది.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.అంతే కాదు మాస్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ అంటే ఏంటో ఈ సినిమానే చూపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube